Tuesday, 3 November 2026

నీలోఫర్‌లో చిన్నారి కిడ్నాప్‌..సుఖాంతం

హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల నీలోఫర్‌ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌ అయ్యింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆచూకీ కోసం అబిడ్స్‌, నాంపల్లి పోలీసులు గాలించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో
చిన్నారి ఆచూకి దొరికొంది. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీ పూటేజి ద్వారా అనుమానిత మహిళను పోలీసులు గుర్తించారు. అత్తాపూర్‌ కల్లు కాంపౌండ్‌ దగ్గర చిన్నారిని కాపాడారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌ అయిన నాలుగు గంటల్లోనే ఈ కేసును పోలీసులు చేధించారు. సీసీటీవీ పూటేజి ఆధారంగా చిన్నారి ఆచూకి లభించినట్లు తెలిపారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు ప్రకటించారు.