Tuesday, 3 November 2026

రాష్ట్రవ్యాప్తంగా జూడాల సమ్మె

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ వైద్యులు సమ్మెకు దిగారు. గ్రామీణ సర్వీసుల మార్పుల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూడాలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిలిపివేసి వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సాధారణ సేవలు నిలిపివేశారు. ఆసుపత్రి పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *