రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంటున్న ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ. .
మల్లాపూర్ ,(జనం సాక్షి) సెప్టెంబర్:05 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి.వి.రావుపేట సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగారాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాన్ని విద్యాశాఖ మంత్రి శ్రీమతి సభిత ఇంద్రారెడ్డి , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎం ఎల్ సి రఘోత్తంరెడ్డి వారి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొక్కుల బాలకృష్ణ అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ జోగుల మమత-రాజేష్, వెంపెల్లి గ్రామ సర్పంచ్ బిట్ల సరోజన-నరేష్, ఇరుగ్రామాల ఎంపీటీ సి లు తోట సుజాత శ్రీనివాస్, గుగ్లావత్ భూమి రాజేందర్, ఎస్ ఎం సి చేర్మెన్ తోట సుజాత మోహన్, వైస్ చేర్మెన్ కొత్తపెల్లి రవి, ఉపసర్పంచులు కొడిమ్యాల రవి, వెల్మల రాజనర్సయ్య, వి డి సి చేర్మెన్లు మండ్ల రాజరెడ్డి, సంద చిన్న కాశిరెడ్డి, నాయకులు కనుముల సంజీవ్, నిమ్మల అనంతరెడ్డి, పీఇటీ రాజశేఖర్ గార్లు పాల్గొన్నారు.