Tuesday, 3 November 2026

‘రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన సర్కారు’

హైదరాబాద్‌ : కరెంట్‌ కోత, చార్జీల మోతతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని ప్రభుత్వంపై సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్‌ సమస్య అంశం చర్చకు రాకుండా శాసనసభను ప్రభుత్వం వాయిదా వేయిస్తోందని ఆయన ఆరోపించారు. కరెంట్‌ సమస్యలపై రాఘవులు, నారాయణ దీక్ష చేస్తున్నా కిరణ్‌ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రభుత్వం హామీయిచ్చే వరకు వెనక్కు తగ్గబోమని జూలకంటి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *