:విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఎల్బీ నగర్ ( జనం సాక్షి ) రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మారుస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ అని వవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు . మహేశ్వరం మండలం గట్టుపల్లిలో అండర్ 23 క్రికెట్ టోర్నీలో భాగంగా జింబాబ్వే వర్సెస్ ఎం ఎస్ కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీతో జరిగే మ్యాచ్ ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య ఆతిదిగా హాజరై ప్రారంభించారు . అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలను,క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మారుస్తున్నారన్నారు. అంతర్జాతీయ పోటీలకు వేదికగా గట్టు పల్లి కేసీఆర్ గ్రౌండ్. గట్టుపల్లి గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంను నిర్మించడం అభినందనీయం. ఉప్పల్ తర్వాత అతి పెద్ద క్రికెట్ మైదానం గా కేసీఆర్ స్టేడియం నిలుస్తుందని తెలిపారు . అత్యున్నత ప్రమాణాలతో,పూర్తి సౌకర్యాలతో గ్రౌండ్ ఉంటే దేశ,అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు ఆకర్షిస్తుంది. జింబాబ్వే లాంటి జట్లు వచ్చి మన ప్రాంతంలో పోటీల్లో పాల్గొనటం అభినందనీయమని….భవిష్యత్తు లో మరిన్ని పోటీలకు ఈ గ్రౌండ్ వేదిక కావాలి. టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించి ,ఇరు జట్ల క్రీడాకారులతో మంత్రి పరిచయం చేసుకొని అభినందించారు.




