రాష్ట్రీయ గోకుల్ పథకం కింద సబ్సీడి లోను మంజూరు
మిర్యాలగూడ, జనం సాక్షి.
పశు సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రాష్ట్రీయ గోకుల్ పథకం కింద మిర్యాలగూడ కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మువ్వా రామా రావు కి ముర్రా జాతి పశువులను పెంపొందించుటకు కొరకు నాలుగు కోట్ల రూపాయిలు మంజూరు చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు డీ.జీ.ఎమ్ .ఎన్ ఎస్ వి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశు సంపదను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సబ్సిడీలతో కూడిన రుణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రుణ గ్రహీత డాక్టర్ మువ్వా రామారావు కు రుణ మంజూరు పత్రాన్ని అందించారు . కార్యక్రమంలో ,ఏ జి ఎం .సీ హెచ్ .విజయలక్ష్మీ .బ్రాంచ్ మేనేజర్ ఎం .రాజివ్ లు పాల్గొన్నారు.
Attachments area