రాష్ట్ర అవతరణ దినోత్సవానికి భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌: నవంబర్‌ 1న ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సీపీ అనురాగ్‌శర్మ తెలియజేశారు. రేపు ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణవాదులు నిరసన తెలపకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నవంబర్‌ 1ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.