రాష్ట్ర పండుగగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి 107వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనం సాక్షి సెప్టెంబర్ 24:
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వీర నారి చాకలి ఐలమ్మ గారి 107 వ జయంతి ఉత్సవ కార్యక్రమమును రాష్ట్ర పండుగగా బి.సి.సంక్షేమ శాఖా ఆధ్వర్యములో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క కార్యక్రమమును సోమవారం 26 న ఉదయము 10.30 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్, వికారాబాద్ యందు నిర్వహించబడును . కావున ఈ యొక్క కార్యక్రమమునకు వెనుకబడిన తరగతుల ప్రభుత్వేతర ప్రతినిధులు , దళిత , గిరిజన ప్రతినిధులు, మరియు ప్రజలు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమమును జయప్రదం చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.
Attachments area