రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వచ్చే నెలలో జరుగనున్న దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక జమ్మిగడ్డ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్ లో జరిగిన ఆ సంఘ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో దళితుల వివక్షత , జీవన భద్రత , సమాన మహిళ భాగస్వామ్యం , దళిత బహుజనుల సంక్షేమం , భూసాధనే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందన్నారు.సమాజంలో దళిత బహుజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత మామిడి వెంకన్నను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పంతం నర్సయ్య , పుట్టల దుర్గ , హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న , నాయకులు వగ్గు వెంకన్న, దేవదానం , మీసాల పిచ్చయ్య , ఇరుగు రమణ , మల్లేష్ , అచ్చీ తదితరులు పాల్గొన్నారు.