రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి..
బంటు పిలుపు
మిర్యాలగూడ. జనం సాక్షి
వచ్చే నెలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే సిపిఐ. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మహాసభల గోడ పత్రికలను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న నేటికీ పేదలు కూడు. గూడుకు కరువయ్యారని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార దాహం తప్ప ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు సృష్టించి సమాజంలో చీలికలు తీసుకొస్తున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బిజెపి ఇతర పార్టీలు, ప్రభుత్వాలను ఒక్కొక్కటిగా కూల్చేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ప్రజా సమస్యలనే ఎజెండాగా ఎంచుకొని వాటి పరిష్కారం కోసం రాజీలేని ఉద్యమాలను సాగిస్తామన్నారు నాలుగో తేదీ నుంచి ఏడు వరకు జరిగే మాసభలను జయప్రదం చేయాలని అన్నారు కార్యక్రమంలో మిర్యాలగూడ. దామరచర్ల మండల కార్యదర్శి ఎండి సయ్యద్. ధీరావత్ లింగ నాయక్. రైతు సంఘం నాయకులు జిల్లా కనకయ్య. మహిళా నాయకురాలు దాసర్ల దుర్గమ్మ. ఎస్కే షమీం. మామిడి మార్తమ్మ. అలివేలు. మంగమ్మ. గోపమ్మ. లింగయ్య పాల్గొన్నారు