*విద్యార్థికి కుటుంబమే మొదటి పాఠశాల తల్లిదండ్రులే మొదటి గురువు*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.విద్యార్థికి కుటుంబమే మొదటి పాఠశాల,తల్లిదండ్రులే మొదటి గురువులని దిర్సించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు అన్నారు.శనివారం దిర్సించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశం విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించారు.ఈ సందర్బంగా బట్టు మధు మాట్లాడుతూ విద్యా సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయడానికి ఎస్ఎంసి సభ్యులు ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు అవగాహణ కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ సభ్యులు కుంటిగొర్ల సైదులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీనివాస రావు,శ్రీనివాస్,విజయ్ కుమార్,అశోక్ కుమార్,యాదగిరి, తదితరులు ఉన్నారు.