Tuesday, 3 November 2026

 రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి – ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, మార్చి  06( జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడంద్వారా మహిళా పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు హైదర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరకెపూడి మాట్లాడుతూ  మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మూడు రోజులపాటు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పిలుపుమేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెరాస శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కెసిఆర్ చిత్రపటానికి స్థానిక మహిళలతో రాఖీ కట్టించి పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించి చీరలు పంపిణీ చేశారు.  అనంతరం మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయినా కెసిఆర్ కిట్, ఇతర పథకాల లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారితో సెల్ఫీలు దిగడం, 8వ తేదీన నియోజకవర్గ స్థాయి మహిళలతో సమావేశం, సంబరాలు ఇతర కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు  పోతుల రాజేందర్, రాగ ప్రసాద్, వీరపనేని శ్రీనివాస్, వెంకటయ్య యాదవ్, సత్యనారాయణ, సిద్దం శ్రీకాంత్, ఖదీర్, సదా బాలయ్య, కుమార స్వామి, మహేష్ రెడ్డి,  అప్పిరెడ్డి, సత్తార్, రాజు సాగర్, యుగేష్ రెడ్డి, యాసిన్, దానయ్య, మహిళ నాయకులు, లత, కృష్ణ కుమారి, బీజన్ బీ, హైమ్మడ్ ఉన్నిస్సా, పర్వీన్, రేణుక, మాధవి, విమల, జ్యోతి, స్వప్న, ఏలెంద్ర, విజయలక్ష్మి,  వేంకటేశ్వరి GHMC కమ్యూనిటీ ఆఫీసర్ ముస్తఫా,  SFA లు భరత్, సంజీవ రావు, శ్రీకాంత్ వారి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు