హైదరాబాద్: రాష్ట్ర విభజన అనేది రాజకీయ సమస్య అని దానిని రాజకీయ నాయుకులే తేల్చాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సమస్యను పరిష్కరించకుండా ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్దేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలంగాణ అంశం పరిష్కరించేంత వరకు రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కు ప్రజలకుందన్నారు. జోన్నవిత్తుల రామలింగేశ్వర్‌రావు రచించిన సింగరేణిశతకం పుస్తకాన్ని పబ్లిక్ గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించారు.




