Thursday, 5 November 2026

రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయండి

CITU జిల్లా కార్యదర్శి జి సాయిలు.

జనం సాక్షి జోగుపేట ఆందోల్ ఆదివారం జోగుపేట పట్టణంలోని సిఐటియు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు ఈ సందర్భంగా జోగిపేట పట్టణంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం సిఐటియు ఆఫీసులో జరిగింది అనంతరం మాహా సభ ల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్న సిఐటియు రాష్ట్ర నాలుగో మహాసభలు డిసెంబర్ 21 22 23 తేదీల్లో సిద్దిపేటలో జరుగుతున్నాయని ఈ మహాసభను జయప్రదం చేయాలని కార్మికులకు ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను ప్రజలను చైతన్యం చేస్తూ వారి పక్షాన నిలబడుతుంది సిఐటియు అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక వర్గ రక్షణ కోసం హక్కుల కోసం ఈ మాసభల్లో చర్చించి రాబోయే కాలంలో ఐక్య ఉద్యమాలు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడానికి భవిష్యత్తు ప్రణాళిక మహాసభ లో రూపొందిస్తుందని అన్నారు. ఈ మహాసభల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు శ్రేయోభిలాషులు కార్మికులు ఉద్యోగులు తమ ఆర్థిక, హార్థిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి విద్యాసాగర్ సిఐటియు నాయకులు సంతోష్ సురేష్ నరేందర్ రెడ్డి శివ సాయి బాబా రవీందర్ రాములు నగేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు