Thursday, 5 November 2026

రాహుల్‌కు ఓయూలో పర్యటించే అర్హత లేదు: పిడమర్తి

హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించే అర్హత లేదని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి పేర్కొన్నారు. ఉద్యమంలో పని చేసిన ఒక్క విద్యార్థికి కూడా గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని గుర్తు చేశారు. కొంతమందికి టికెట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగ సభ పెట్టే అర్హత కాంగ్రెస్‌కు లేదని పిడమర్తి రవి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులే నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ పర్యటనపై రాహుల్‌గాంధీ పునరాలోచించుకోవాలని పిడమర్తి రవి సూచించారు. రాహుల్‌గాంధీకి తెలంగాణ, ఓయూలో పర్యటించే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తమని సీడబ్ల్యూసీలో తీర్మానించిన కాంగ్రెస్‌.. తెలంగాణకు ఇస్తామని ఎందుకు చెప్పలేదన్నారు. రాహుల్‌కు ఓయూ గురించి ఏం తెలుసు. ఇన్నేళ్లు గుర్తుకు రాని అమరవీరుల స్థూపం ఇప్పుడు గుర్తుకొస్తుందా? రాహుల్‌ ఓయూకు వస్తే విద్యార్థులు అడ్డుకుంటారని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎస్సీల వర్గీకరణ, మైనార్టీ, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ వైఖరేంటో చెప్పాలన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేసింది. కాంగ్రెస్‌ వైఖరి వల్లే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని టీఎస్‌ జేఏసీ చైర్మన్‌ దూదిమెట్ల బాల్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు.