– కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు
– ఆ విషయం రాహుల్‌కు స్థానిక నేతల తీరుతో అర్థమయింది
– నగరంలోని సీమాంధ్రులంతా కేసీఆర్‌తోనే ఉన్నారు
– తెరాస నేత దానం నాగేందర్
హైదరాబాద్, ఆగస్టు14(జనం సాక్షి) : రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కిరాయికి ప్రజలను తీసుకువచ్చి ర్యాలీలు తీశారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా అని దానం ప్రశ్నించారు. తెలంగాణ గురించి రాహుల్ ఒక్కసారైనా పార్లమెంట్‌లో మాట్లాడారా అని అడిగారు. కాంగ్రెస్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు చేసిందేవిూ లేదని దానం చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఉద్ఘాటించారు. సామాజిక న్యాయం గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారని స్పష్టం చేశారు. నగరంలోని సీమాంధ్రులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. కాంగ్రెస్ నేతలు అడ్రస్ లేకుండా పోతారని దానం నాగేందర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత కేసీఆర్‌ది అన్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా నాలుగేళ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేడం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారని, హర్షం వ్యక్తం చేస్తున్నారని దానం పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకారం లేకుండానే తెరాసను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నారని నాగేందర్ అన్నారు.




