రాహుల్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ చర్చిలో ప్రార్థనలు

ఝరాసంగం సెప్టెంబర్ 8 ( జనం సాక్షి): రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు విజయవంతం కావాలని కోరుతూ మండల జడ్పీటీసీ వినీల నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మెదపల్లి చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు అందరూ మద్దతు తెలపాలంటే రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరల కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజల సుఖశాంతులతో బ్రతికే విధంగా చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.ముక్తార్ పటేల్ అలిగే జాన్ ,సిద్ధు పటేల్ ,వార్డు సభ్యులు ఇటికెపల్లి సంగమేశ్వర్ పటేల్ ,శివన్న, వీరన్న పటేల్ ,జగదీష్ పటేల్ బండప్ప ఎస్ ఎం సి చైర్మెన్ లక్ష్మణ్ ,మైనోద్దీన్, నాయకులు మునీరోధిన్, జగదీశ్వర్ బోయిని పాండు ,పండరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.