హైదరాబాద్: రైతుల రుణమాఫీపై కేంద్రమంత్రి సచిన్ పైలట్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీ సాధ్యం కాదని సీఎం ఎలా చెప్పగలిగారో సమాధానం చెప్పాలని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి లేదని సోమిరెడ్డి అన్నారు.




