రుద్రూర్ మండలన్నీ సందర్శించిన కేంద్ర మంత్రి….

కేంద్రమంత్రికి పుష్పగుచ్చం అందిస్తున్న దృశ్యం…

 

రుద్రూర్ (జనంసాక్షి) :- భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పరమైన
చర్చలు జరిపి, అనంతరం రుద్రూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. సర్పంచ్ మరియు వార్డు సభ్యులు స్వాగతం పలుకుతూ ఆమెకు పుష్పగుచ్చం అందించారు
గ్రామ పంచాయతీకి నిధులు సక్రమంగా అందుతున్నాయా లేవా అని ఆమె సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నిధులు ప్రతి నెల అందుతున్నాయని ఆయన వివరించారు. అనంతరం గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ మాట్లాడుతూ.. పంచాయతీ పోర్టల్ ఆన్ లైన్ రికార్డులు పూర్తి అయ్యాయని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. తర్వాత సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ ఆమెతో మాట్లాడుతూ.. గ్రామపంచాయతీకి మీటింగ్ హాల్ కోసం బిల్డింగ్ ఇప్పించాలని కోరగా, ఆమె సానుకూలంగా స్పందించారు.. ఈ కార్యక్రమంలో బిజెపి బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాల్యాద్రి రెడ్డి , కామధేను ఫుడ్ ఇండస్ట్రీస్ బచ్చు రాము,
వార్డు మెంబర్లు, అధికారులు,గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.