వైఎస్ సేవలు మరువలేనివి
మండల కన్వీనర్ మోర సుదర్శన్ జిల్లా నాయకులు తాళ్ల పెళ్లి సురేష్
శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 2
జనహృదయ నేత మాజీ ముఖమంత్రి స్వర్గీయ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువ లేనివని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మోరే సుదర్శన్ జిల్లా నాయకులు తాళ్ల పెళ్లి సురేష్ కొనియాడారు.శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి 13 వర్దంతి కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులు తాళ్ల పెళ్లి సురేష్ ఈ సందర్భంగా
మాట్లాడుతూ పేద,బడుగు బలహీణ వర్గాల ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందిన వైఎస్ తెలంగాణ రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత వైఎస్ దక్కుతుందన్నారు.రాష్ట్రం దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలు రోగాల బారిన పడితే లక్షల రూపాయలు వైద్య ఖర్చులు చెల్లించే ఆర్థిక స్థోమతలేదని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి పేదలు బడుగు బలహీణ వర్గాల ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచారన్నారు. వృద్దుల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశ పెట్టి మదుసలి జీవితాలకు వైఎస్ అండగా నిలిచారన్నారు.పేద విద్యార్థులు ఉన్నత చదువు కోసం ఫీజు రిఅంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టి ఎన్నో వేలమంది విద్యార్థుల ఉన్నత చదువులు చదివేలా వైఎస్ సహకరించారన్నారు.నిల్వ నీడ లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి నీడ లేని బలహీణ వర్గాల ప్రజలకు నీడగా నిలిచారన్నారు. దళితులకు మూడెకరాలు భూమి,ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సిఎం కేసీఆర్ ఇప్పటికి అమలు చేసినా పాపాన పోలేదన్నారు. పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చి నిల్వ నీడ లేని పేదలను ఆదుకంటామని హామీ ఇచ్చిన సిఎం కేసీఆర్ దాని అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తాళ్లపల్లి సురేష్ ధీమా వ్యక్తం చేశారు. పేదప్రజల సమస్యల పరిష్కారంలో ఆది నుండి ముందున్న పార్టీ కాంగ్రెస్సేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని,కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతలు తదితరులు పాల్గొన్నారు.