హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాల్ సెంటర్ పేరుతో బ్యాంకు అకౌంట్లు కొ/-లగొట్టిన ఢిల్లీకి చెందిన మూడు ముఠాలను సైబరాబాద్ సైబర్ కైం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు ముఠాల్లో మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 80 లక్షల రూపాయల నగదు, ల్యాప్ టాప్ లు, క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఎస్‌బీఐ కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఖాతాదారులు వివరాలు తెలుసుకునేవారు. ఏటీఎం కార్డ్ బ్లాక్ అయ్యిందని, బాంక్ అకౌంట్ అప్‌డేట్ కోసం కార్డ్ పిన్ నెంబర్, ఓటీపీ నెంబర్ తెలుసుకుని వారి ఖాతాల్లోని సొమ్ము కాజేసేవాళ్లు. దాదాపు రెండు వేల మంది ఎస్‌బీఐ ఖాతాదారుల ఖాతాల్లో నుంటి వీరు రూ.5 కోట్లు కొల్లగొట్టారు. వీరు హైదరాబాద్ లో ఎకౌంట్లను ఓపెన్ చేసి, ఢిల్లీని కేంద్రంగా చేసుకుని కాల్ సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు




