Monday, 2 November 2026

రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ సంఘాల సహకారం

హైదరాబాద్‌: ఫిబ్రవరి 21,22వ తేదీన జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు సన్నాహకాలు జరుపుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలకు అనుబంధంగా ఆర్టీసీలో పనిచేస్తున్న రాష్ట్ర సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించాయి. సమ్మెను విజయవంతం చేయడంపై వివిధ కార్మిక సంఘాలతో చర్చించాయి. సమ్మె రోజు 48 గంటలపాటు ఆర్టీసీ బస్సులు తిరగకుండా అన్ని సంఘాలు కృషి చేయాలని ఈ  సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సూచించారు. ఫిబ్రవరి 19లోగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనేలా చర్చలు జరపాలని సమావేశం తీర్మానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *