రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో 150 మంది ఉచితంగా కండ్ల అద్దాలు పంపిణీ.

రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో 150 మంది ఉచితంగా కండ్ల అద్దాలు పంపిణీ*
రాజేంద్రనగర్ ఆర్.సి (జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సన్ రైస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గత 15 రోజుల క్రితం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి దాదాపు 17 మందికి కంటి ఆపరేషన్లు చేయించి 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి గురువారం శంషాబాద్ లోని సన్ రైస్ హాస్పిటల్ ముందు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కొరకు సన్ రైస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగానే కంటే ఆపరేషన్ చేయడం జరిగిందని,మరో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు నిత్యం వ్యవసాయ పనులలో బిజీగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని పై శ్రద్ధ చూపరు అన్నారు.పేద ప్రజలకు వైద్యం చేయాలని దృడ సంకల్పంతోనే ఉచిత వైద్య శిబిరం నిర్వహించమన్నారు. సంకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శంషాబాద్ రెడ్డి సేవా సమితి బుచ్చిరెడ్డి, శంకర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సన్ రైస్ హాస్పిటల్ ఎండి రామిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఇందేష్, వేణుగోపాల్ రెడ్డి,దయెశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన రెడ్డి సేవాసమితి, సస్ రైస్ హాస్పిటల్.