*రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతానికి కృషి చేస్తాం
*తహసీల్దార్ సుభాష్ నాయుడు* *అలంపూర్ జనంసాక్షి* (సెప్టెంబర్ 20) రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతానికి కృషి చేస్తామని,అలంపూర్ మండలం తహసిల్దార్ సుభాష్ నాయుడు అన్నారు. రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షు రాలు తమిళ సై సౌందరరాజన్,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఆదేశాల మేరకు సోమవారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో అలంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ మండల కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా తహసీల్దార్ సుభాష్ నాయుడు, ఉపాధ్యక్షులుగా మండల అభివృద్ధి అధికారి నాగ శేషాద్రి సూరి,ఎస్ఐ శ్రీహరి లు కమిటీ లో ఆయా హోదాలలో మండల విద్యాధికారి అశోక్, మున్సిపల్ కమిషనర్ నిత్య నందు మెడికల్ ఆఫీసర్ రాధిక లు కమిటీ లో ఉన్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్ కమిటీ సభ్యులు ప్రకటించి, వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సుభాష్ నాయుడు మాట్లాడుతూ, మండల స్థాయిలో జరిగే రక్తదాన,ఆరోగ్యం, ప్రేరణ వంటి సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని, సభ్యత్వ కార్యక్రమం విరివిగా చేపడతామని, రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధికి అందరం కలిసి కృషి చేస్తామని ఆయన అన్నారు.