ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
కుల్కచర్ల, సెప్టెంబర్ 20 (జనం సాక్షి):
దేశంలో ఎక్కలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నూతన ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.మంగళవారం కుల్కచర్ల మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి,ఘనాపూర్, సాల్వీడ్, చేల్లాపూర్, బొంరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళుతున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కి దక్కుతుందన్నారు.అర్హులైన వృద్ధులకు పెన్షన్ ఇస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్, రైతుబంధు మండల అధ్యక్షులు కేబీ రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, చేల్లాపూర్ సర్పంచ్ చంద్రయ్య, బొంరెడ్డిపల్లి సర్పంచ్ అంజీలయ్య, సాల్వీడ్ సర్పంచ్ బాలయ్య, తెరాస నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.