రేపు ఝరాసంగం మండలం లో ఎమ్మెల్యే పర్యటన
జహీరాబాద్ ఆగస్టు 31 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 57 ఏండ్లు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు అందిస్తున్న ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో జాహిరబాద్ ఎమ్మెల్యే మాణిక్ హాజరుకానున్నారు అని టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి తెలిపారు. సెప్టెంబర్ 1 న ఝరాసంగం మండలం లోని క్రిష్ణపూర్, బిడెకన్య, చిలపల్లి తండా చిలపల్లి ,సిద్దాపూర్,వనంపల్లి,భోజ్యా నాయక్ తండా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ఆసరా పింఛన్ లబ్దిదారులకు గ్రామంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు చేతులమీదుగా అర్హులైన లబ్దిదారులకు ఆసరా గుర్తింపు కార్డు లు అందజేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో మండలం లోని ముఖ్య నాయకులు, సర్పంచ్ లు ఎంపిటిసిలు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, రైతు సమన్వయ అధ్యక్షులు సభ్యులు, సొసైటీ చైర్మన్ సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.