రైతులందరికి వెంటనే కొత్త పాస్ బుక్స్ ఇవ్వాలి.

జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి )రైతులందరికి వెంటనే కొత్త పాస్ బుక్స్ ఇవ్వాలి కోరుతూ
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్.డి. ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ,జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింలు,రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి జి. జయరాజు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ధరణి మూలంగా పారెస్టు భూముల పేరుతో,వక్స్ భూముల పేరుతో ప్రభుత్వం కావాలని కొత్త పాస్ బుక్స్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని అన్నారు. తార తరాలుగా పట్టా పాస్ బుక్స్ ఉండి రెవెన్యూ రికార్డులో హక్కు దారులుగా ఉన్న కూడా కొత్త పాస్ బుక్స్ ఇవ్వకుండా రైతులను ఇబందులు పెట్టడం సరైంది కాదని అన్నారు.ప్రభుత్వం నిత్యం రైతుల గురుంచి మాట్లాడే ప్రభుత్వానికి జహీరాబాద్ రైతులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతు బంధు,రైతు బీమా,బ్యాంక్ లో రుణాలు రావడం లేదని మరి ఈ రైతులు ఎట్లా బ్రతుకుతున్నారని పాటించుకున పాపాన కూడా పోలేదని అన్నారు.ప్రభుత్వం కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే కొత్త పాస్ బుక్స్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.వారం రోజులలో పాస్ బుక్స్ పై ప్రభుత్వం స్పస్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం ఉదృతం చేస్తాం అన్నారు ఈ కార్యక్రమంలో మాచిరెడ్డి పల్లి,బిడేకన్య, గుడుపల్లి,కాశింపుర్, గోపాన్ పల్లి,చిరగ్ పల్లి,సత్వర్,అల్ గోల్,ఔరంగా నగర్,గ్రామాలకు చెందిన రైతులు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చంద్రన్న,సంగన్న,శ్రీనివాస్,కౌడి.నర్సింలు,యం. ప్రకాష్,నర్సింలు,సంజీవ్, మల్లేష్,అనివిరప్ప, తదితరులు పాల్గొన్నారు.