రైతులకు సాగునీరు అందించడమే నా చివరి కోరిక

రాజంపేట్ జనంసాక్షి ఆగస్టు 14

రాజంపేట్ మండల కేంద్రంలోని ఆదివారం నిర్వహించిన సే హాత్ జోడయాత్ర లో భాగంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు తాగునీరు అందించానని, ఇప్పుడు తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని మిషన్ భగీరథ అని పేరు పెట్టి తాగునీరు అందిస్తున్నారని, రైతులకు 21 22 ప్యాకేజీ ద్వారా అందించడమే నా చివరి కోరిక అన్నారు, రాజంపేట్ మండల కేంద్రంలో బీసీ కాలనీ, సర్వేనెంబర్ 576 టిఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, నేను గెలిచిన వెంటనే భూ కబ్జాలకు పాల్పడిన వారి నుండి భూమి తీసుకుని ప్రజలకు పంచుతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి, మండల యువజన అధ్యక్షుడు అంకం కృష్ణారావు, రాజంపేట్ గ్రామ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, వజాయిద్ అలీ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు