రైతులతో చేలగాటం ఆడితే సహించేది లేదు “జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల.
జగిత్యాల జిల్లా ధర్మపురి ( జన సాక్షి ) రైతులతో చెలగాటమాడితే సహించేది లేదంటున్న జర్నలిస్టు విక్రమ్ రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా మీడియాకు అందించిన విక్రం రెడ్డి, అప్పో సప్పో చేసి పెట్టుబడి పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటిల్లిపాది ఎండనక వాననాకా చలి అనక రెయిoబవాళ్ళు శ్రేమించి పండించే అన్నదాత తో ప్రభుత్వం చేలగాటం ఆడితే ఎట్టిపరిస్థితులల్లో సహించేది లేదని రైతు రాష్ట్ర నాయకులు,ఎమ్మెల్యే పరాజితుడు అభ్యుదయ యువ రైతు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు. సోమవారం రైతుల ఇబ్బందులు సమస్యలను తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ, అనుక్షేనం అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అరిగోసపెట్టడం ఇదివరకే ఎన్నో మార్లు స్పష్టం అవగా మరో మారు గా ప్రభుత్వం అధికారులు రైతును అయోమయంలో ముంచి నష్టపరిచే విధంగా ఉద్యనవన సాగుకు ప్రభుత్వ ప్రోస్సహం అంటూ రైతులను ఉరిస్తున్నారు అని ఇది తగదు అని గతంలో కేవలం ఆయిల్ ఫామ్ సాగుకు తప్ప దేనికి సబ్సిడీలు లేవని రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు జోరు వర్షాకాలం లో ఆగమేఘాల పై లక్ష్యం చేరుకొనేందుకు అతి కొద్ది గడువుతో లబ్ధిదారుల ఎoపికకు చివరి గడువు అనడం సబబు కాదని, ఇప్పటికే రైతులు ఏదో పంట సాగు చేసి ఉన్నారు ఇప్పుడు నడికాలంలో సాగు చేసుకోవాలంటే ఎలా వేసవిలో ప్రణాళికలు రూపొందించి వర్షాకాలం ముందే సంసిద్ధం చేస్తే సరి పోవుగా అట్లా చేయక రైతులను ఎటుపాలుపోని స్థితికి గురిచేయడం సిగ్గుచేటు అని ఇప్పటికయినా ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు పునరాలోచన చేయాలని లేని పక్షంలో రైతాంగం నుండి పెద్ద ఎత్హున నిరసన ఎదురుకోక తప్పదని జోస్యం చెప్పారు