రోడ్డు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలి – కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సాగి అజిత్ రావు

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపెల్లి నుండి మంథని గుండా కాళేశ్వరం పోయే ప్రధాన రహదారి భారీ వాహనాలు పోవడం వల్ల, టైర్ గణేలు పడి.. ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ సాగి అజిత్ రావు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. రామగిరి మండలం పరిధి లో భారీ వాహనాలు పోవడం వల్ల టైర్ గడేలు పడి..ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, నిదానందంగా వచ్చే వాళ్ళ వాహనాలు షేక్ అవుతున్నాయన్నారు. కొందరు
రాత్రి వచ్చే వాళ్ళు ఆజ్యనం తో హత్యలు గావింప ప్రదేశం కావడంతో దయ్యం పట్టిందని భావిస్తున్నారని, ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే స్పందించి నాణ్యత లేని రోడ్లు వేసిన కాంట్రాక్టర్స్ మీద చర్య తీసుకొని, మరిన్ని ప్రమాదాలు జరగక ముందే రోడ్ల మరమ్మతులు చేయాలని అజిత్ రావు తన వినతిపత్రంలో కోరారు.

తాజావార్తలు