హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్, మిట్టకోడురు గ్రామాల్లో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రమణ పరామర్శించారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కుటుంబానికి దుబ్బాక ఎన్నికలపై ఉన్న ప్రేమ భారీ వర్షాలతో నష్టపోయిన రైతులపై లేదని వ్యాఖ్యానించారు. నియంత్రిత పంట విధానం పేరిట ప్రభుత్వం రైతులతో నిర్భందంగా పంటలు వేయించిందని.. ఇప్పుడు ఆ పంటలు నష్టపోయిన రైతులను పట్టించుకోవడం లేదని విమర్శలు గప్పించారు. భారీ వర్షాలతో రైతులు నష్టపోతే కెసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. 18 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చిందని వెంటనే నష్టపోయిన రైతులనూ ఆదుకోవాలని రమణ డిమాండ్ చేశారు. లేదంటే రైతు సంఘాలను ఏకం చేసి టిడిపి తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేసీఆర్ సర్కార్‌ను ఎల్ రమణ హెచ్చరించారు.




