లాంఛనంగా ప్రారంభించిన సిఎస్ సోమేశ్
తొలిరోజు 946 మంది రిజిస్టేష్రన్ల కోసం నగదు చెల్లింపు
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): రెవెన్యూశాఖలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు
పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్టేష్రన్ల సేవలను శంషాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉదయం లాంఛనగంగా ప్రారంభించారు. ధరణి సేవల పక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
వివరించారు. గత నెల 29న సీఎం కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్టేష్రన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయని స్పష్టం చేశారు. ఏకకాలంలో రిజిస్టేష్రన్లు, మ్యుటేషన్ల పక్రియ కొనసాగుతుందని అన్నారు. తొలిరోజు 946 మంది రిజిస్టేష్రన్ల కోసం నగదు చెల్లించారు. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందనున్నాయి. విూసేవా కేంద్రాల్లోనూ రూ.200 లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లపై త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామని ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యవసాయేతర రిజిస్టేష్రన్ల పక్రియ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.




