రైతుల క్షేమాన్ని కోరేది బి ఆర్ఎస్ ప్రభుత్వం డిసిసిబి డైరెక్టర్ అంజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్
మోమిన్ పేట ఆగస్టు 3 జనం సాక్షి
మొమిన్ పేట:దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరిగా రైతు సంక్షేమం అందించేందుకు కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని,హైదరాబాద్(రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మేకవనాంపల్లి అధ్యక్షులు పట్లోళ్ల అంజి రెడ్డి మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ లు పేర్కొన్నారు .గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మొమిన్ పేట బ్రాంచ్ డీసీసీబీ బ్యాంక్ లో రైతు రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏ సందర్భంలో ఏం కావాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసని తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లాంటి రైతు సంక్షేమ విధానాలను అమలు చేయడంలేదన్నారు.ఈ కార్యక్రమంలో మొమిన్ పేట సంఘ అధ్యక్షులు బి విష్ణువర్ధన్ రెడ్డి బ్యాంక్ మనేజర్ కే నారాయణ్ రెడ్డి బ్యాంక్ సిబ్బంది, సంఘ సెక్రెటరీలు, శేఖర్ బాలయ్య రాజు పిఎసిఎస్ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.