Tuesday, 3 November 2026

రైతుల పంట రుణాలు వడ్డీతో సహా వెంటనే మాఫీ చేయాలి : పిట్ట ఉపేందర్ రెడ్డి

   ఎల్బీనగర్ (జనం సాక్షి )  భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుండి చేపడుతున్నటువంటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా ఈరోజు రంగా రెడ్డి అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా  జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ వి నరసింహ రావు గారి ఆధ్వర్యంలో. ఆర్ కె పురం లోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ లో  రైతుల నుండి సంతకాల సేకరణ ఉద్యమ కార్యక్రమం చేపట్టడం జరిగింది.  ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టా ఉపేందర్ రెడ్డి , బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర భూనిర్వాసితుల హక్కుల పరిరక్షణ సెల్ కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి ఆర్ కె పురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి   మాట్లాడుతూ  2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం మేనిపోస్టో లో  తిరిగి అధికారంలోకి రాగానే లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను ఏక మొత్తంగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ  అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.
జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పిట్టా ఉపేందర్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలో వచ్చి  నాలుగు సంవత్సరాల కాలం పూర్తి కావస్తున్నా  ఇచ్చినటువంటి హామీ నేటికి అమలు చేయకపోవడం వల్ల బ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు  అసలు వడ్డీతో సహా పెరిగిపోయి. బ్యాంకుల్లో పరపతి కోల్పోయిన రైతులు వ్యవసాయ అవసరాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవలసిన పరిస్థితి దాపరించిందని అన్నారు. దఫాల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదని అన్నారు.  లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను వడ్డీతో సహా వెంటనే ఈనెల 31 లోపు మాఫీ చేయాలని, మాఫీ చేయనట్లయితే తెలంగాణ రాష్ట్ర రైతులకు అండగా ఉంటామని. తెలంగాణ రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని. అన్నారు. దేశవ్యాప్తంగా అతివృష్టి , అనావృష్టితో రైతులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ (పంటల) బీమా యోజన తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం  అమలు చేయని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలని . కోరారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాయమాటలు నమ్మి రైతులు టి.ఆర్ఎస్ .ను గెలిపిస్తే రైతుబంధు ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చి రైతులకు రావాల్సిన ఇన్ ఫుడ్ సబ్సిడీ వ్యవసాయ పనిముట్ల . విత్తనాలపై రావలసిన రాయితీలు ఇవ్వకుండా మోసం దగా చేస్తున్న ఈ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అనిఅన్నారు. ఈ సంతకాల సేకరణ చేపట్టినటువంటి దరఖాస్తులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేస్తామని అన్నా రూ ఈ కార్యక్రమంలో. కిసాన్ మోర్చా ప్రభారీ మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ట ఉపేందర్ రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి,అధికార ప్రతినిధి కోయ జీవన్ రెడ్డి, గోపి కృష్ణ,రంగా రెడ్డి,అమరెందర్ రెడ్డి,లక్ష్మణ్ గౌడ్,రాజేశ్వర్ రావు,శ్రీనివాసులు,నర్సింహా రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు .