Monday, 2 November 2026

రైతుల సంక్షేమం పై కేసీఆర్ కపట ప్రేమ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 శామీర్ పేట్,జనంసాక్షి : రైతుల సంక్షేమంలో కేసీఆర్ చేసేది గోరంతా చెప్పేది కొండంత ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం శామీర్ పేట్ లోని గ్రోమోర్ ఫర్టిలైజర్ షాప్ లో ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి సేవను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అతిధిగా విచ్చేసి ఆదర్శ రైతులను శాలువాలతో సన్మానించారు. ప్రాజెక్టర్ లో పీఎం మోడి కిసాన్ సమృద్ధి సేవా కేంద్రం ప్రారంభంలో భాగంగా స్పీచ్ ను అందరు తిలకించారు.ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ. సన్న, చిన్నకారు రైతుల సంక్షేమమే ద్యేయంగా యూరియా, డిఏపిలపై భారత ప్రభుత్వం ఎకరాకు సంవత్సరానికి 19వేల రూపాయలు సబ్సిడీ పై అందిస్తుందని అన్నారు. రైతులకు కేసీఆర్ రుణ మాఫీ చేస్తానని గొప్పలు చెప్పి ఇంతవరకు రుణ మాఫీ చెయ్యకపోవడం సిగ్గు చేటన్నారు.రైతులకు నాణ్యమైన విధ్యుత్, వరికీ గిట్టుబాటు ధర భారత ప్రభుత్వమే కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అయితది అని చెప్పి కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని ఏద్దేవా చేశారు.రైతులకు ఎల్లప్పుడూ పంట పండించడంలో సూచనలు, సలహాలు కూడ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ ప్రతినిధులు సుబ్బారెడ్డి, సత్యనారాయణ, బీజేపీ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీనివాస్, హైమారెడ్డి, హృదయ్ కుమార్, యాదగిరి, రైతులు,తదితరులు పాల్గొన్నారు.