ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు,
కొత్తపల్లి జూలై 27 (జనంసాక్షి): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు అని ఎస్సై పి.శీనయ్య అన్నారు . గురువారం మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , బునేడ్, తిమ్మరెడ్డి పల్లి, లింగాల్ చెడ్ పెద్ద వాగులను పరిశీలించారు . ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందనీ , ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందాలని సూచించారు .రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని అన్నారు .మద్దూరు,కొత్తపల్లి మండలాల పరిధిలోని ప్రజలకు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ , ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, ప్రజల ను కోరారు .ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు,చెరువుల వద్దకు వెళ్ళరాదని ,మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడరాదని ఆయన సూచించారు . చెట్ల కింద,పాడైన భవనాలు కింద,శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దని విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదాని ప్రజలకు సూచించారు.