-మండల వ్యవసాయ ఆదికారి నాగెందర్
మిరుదొడ్డి,జూన్ 20(జనంసాక్షి)రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమా రైతులకు ఎంతో ధీమాగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి నాగేందర్ అన్నారు. మండల పరిధిలోని లింగుపల్లి గ్రామంలో రైతు బీమా ఎల్ఐసి నామిని వివరాలను రైతుల నుండి సేకరిస్తున్నారు.భూమి కలిగి ఉండి 18సం”రాల నుండి 60సంవత్సరాలలోపు ఉన్న ప్రతి రైతుకు రైతు బీమా వర్తిస్తుందని తెలిపారు.రైతులు ప్రమాదవశాత్తు లేదా అకాల మరణం చెందితే. ఆ కుటుంబానికి అయిదు లక్షల రూపాయలు బీమా ద్వారా అందుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమాను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తుందని,సంక్షేమ ఫలాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని ఆర్థికాబివృద్ధి సాధించాలన్నారు. రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకునే రైతులు రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రీయ ఎరువులపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఇఒ రేణుక, రైతు సమన్వయ సమితి నాయకులు నాగరాజు,ముత్యాలు, మహేష్ ,రాజు ,రాజయ్య , మల్లేశం పలువురు పాల్గొన్నారు




