*రైతు బీమా చెల్లింపుల్లో జాప్యం చేయెద్దు!

*ఎల్లారెడ్డి ఏడిఏ రత్న
_________________________
లింగంపేట్ 18 అక్టోబర్ (జనంసాక్షి)
యాసంగి పంటల్లో రైతులకు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎల్లారెడ్డి వ్యవసాయ సంచాలకులు రత్న అన్నారు.ఆమె మంగళవారం లింగంపేట్ మండల కేంద్రంలోని రైతు వేధిక భవనంలో డివిజన్ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులకు యాసంగి పంటలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు మరణించిన వారంలోపు రైతు బీమాకు సంబంధించిన బీమా చెల్లింపులు త్వరగా జరిగేల చూడాలని వారికి సూచించారు.రైతు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు నామిని ధ్రువపత్రాలు రైతు బీమా పోర్టల్లో పొందు పరచాలని పేర్కొన్నారు.వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడాలన్నారు.వరి కొనుగోలు కేంద్రాలు,యాసంగి పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి అనిల్ కుమార్,డివిజన్ స్థాయి వ్యవసాయ అధికారులు సంతోష్ కుమార్ ఎల్లారెడ్డి, విజయ్ నాగిరెడ్డిపేట్,శ్రీకాంత్ తాడ్వాయి,ప్రజాప్రత్ సదాశివనగర్,హరీష్ రామారెడ్డి,నరేష్ గాంధారి తోపాటు డివిజన్ లోని వివిద మండలాల ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area