Wednesday, 4 November 2026

రైతు భీమాతో రైతన్న కుటుంబానికి అండగా సీఎం కేసీఆర్

రైతు బీమా ప్రోసిడింగ్ అందజేసిన తెరాస జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి11(జనంసాక్షి) రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోరేటి నరసింహ ఇటీవల అనారోగ్యంతో మరణించగా తెలంగాణ ప్రభుత్వం అందించే ₹5 లక్షల రైతు భీమా ప్రొసీడింగ్ ని నరసింహ సతీమణి పద్మమ్మ కి ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజేశారు
కార్యక్రమంలో మండలం తెరాస ప్రధాన కార్యదర్శి పాశ్చా భాష,సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ,గ్రామ శాఖ అధ్యక్షులు కట్టెల కృష్ణయ్య, మండల ప్రచార కార్యదర్శి యూత్ వింగ్ తాండా శివలింగం, నక్కబాలరాజు యాదవ్, గౌరొజు శ్రీనివాస్ చారి, మొండిగౌరెల్లి యూత్ వింగ్ అధ్యక్షులు తాండ్ర అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు