రైతు రుణమాఫీపై అన్నదాతలు హర్షం
కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి
జనం సాక్షి/ కొల్చారం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి సీఎం కేసీఆర్ రైతు బాంధవునిగా రైతుల మదిలో చిరకాలం నిలిచిపోయాడని కిష్టాపూర్ సర్పంచ్ తిరునగిరి గోదావరి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ బస్ స్టాప్ వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆదివారం సర్పంచ్ తిరునగిరి గోదావరి వెంకట్రాముల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతులంతా సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ దుర్గయ్య, రైతులు కుమార్ యాదవ్ , రవి, కర్రే నారాయణ, పోచయ్య, మల్లేశం,చిన్న తదితరులు పాల్గొన్నారు.