రైల్లో మరిచిపోయిన బ్యాగును బాధితునికి అప్పగించిన ఎస్సై శ్రవణ్ కుమార్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 22 , ( జనం సాక్షి ) : హైదరాబాదుకు చెందిన శంకర్ అనే వ్యక్తి రైల్లో మరిచిపోయిన బ్యాగును ఎస్సై శ్రవణ్ కుమార్ బాధితునికి అప్పగించారు. ఎస్ఐ శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లో నివాసం ఉంటున్న శంకర్ అనే లుంగీల వ్యాపారి వ్యాపార నిమిత్తం శనివారం రోజున హైదరాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలులో బయలుదేరి భువనగిరిలో దిగడం జరిగింది.ఈ క్రమంలో రైలుదిగే ఆతృతలో తనవెంట తెచ్చుకున్న మూడు బ్యాగులలో రెండు మాత్రమే తీసుకుని మూడవది రైలులో మరిచిపో యాడు.శంకర్ వెంటనే 100 కు డయల్ చేసాడు. స్టేషన్ ఘనపూర్ సీఐ రాఘవేందర్ ఆదేశాల మేర కు ఎస్సై శ్రావణ్ కుమార్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ అలీ,కానిస్టేబుల్ శాగంటి శ్రీనివాసులు చాకచక్యం గా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలులో బాధితుడు శంకర్ చెప్పిన బోగీలో బ్యాగును వెతికిపట్టుకొని బ్యాగులో బాధి తునికి సంబంధించిన 5 వేల రూపాయల నగదు, సర్టిఫికెట్లు బాధితునికి అందజేయడం జరిగింది.