శ్రీరామ సేవా సమితి ఏర్పాటు….
కమిటీకి 2లక్షల రూపాయల విరాళం అందించిన పెద్ద బుచ్చిరెడ్డి…
చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నాడు హనుమాన్ మందిరం వద్ద గ్రామా పెద్దలు,యువకులు సమావేశమై శ్రీరామ సేవ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమితి అధ్యక్షుడుగా ఘనోరే రాజేందర్,ఉపాధ్యక్షుడుగా టేకుల పెద్ద బుచ్చిరెడ్డి,ప్రధాన కార్యదర్శిగా టేకుల రాంరెడ్డి,కోశాధికారిగా అంతిరెడ్డిగారి నర్సింహారెడ్డి,కార్యదర్శిగా కుమ్మరి కుమార్ మరియు కార్యవర్గ సభ్యులుగా ఇతరులను ఎన్నుకోవడం జరిగింది.ఈ శ్రీరామ సేవాసమితికి విరాళంగా టేకుల పెద్ద బుచ్చిరెడ్డి(రెండు గుంటల)ఖాళీ స్థలాన్నికి అయ్యే ఖర్చు (రెండు లక్షల ఐదు వేల రూపాయలను)నగదు రూపంలో విరాళంగా శ్రీరామ సేవ సమితికి అందజేశారు.సేవ సమితికి తన వంతు విరాళం ఇచ్చిన పెద్ద బుచ్చిరెడ్డిని సేవ సమితి సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా సేవ సమితి సభ్యులు మాట్లాడుతూ శ్రీరామ సేవ సమితికి ఇంతటి నగదును అందజేసిన పెద్ద బుచ్చిరెడ్డికి ప్రత్యేక అభినందనలు.ఈ ఒక సేవ సమితికి ఇంకా ఎవరైనా దాతలు దయతలచి ముందుకు వచ్చి విరాళాలు అందజేయవల్సిందిగా కోరుతున్నాము.విరాళాలు ఇచ్చే దాతలు ఈ కింది ఫోన్ నెంబర్ కు;9948309509,9963383309 ఫోన్ చేయగలని సమితి సభ్యులు తెలిపారు..