రైస్ బ్యాగును వితరణ చేసిన కాంగ్రెస్ ఇల్లందు నియోజకవర్గ నాయకులు అజ్మీర శంకర నాయక్

బయ్యారం,జులై20(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం, సింగారం గ్రామంలో బాదావత్ మంగ్లీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆ కుటుంబానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు..ఇల్లందు నియోజకవర్గ నాయకులు అజ్మీర శంకర నాయక్ 50 కేజీల రైస్ బ్యాగును అందించారు. బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి ఎంపిటిసి మోహన్ జీ బానోత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి,మంగ్లీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కొండపల్లి లక్ష్మి,గ్రామ శాఖ అధ్యక్షుడు గంగావత్ రవి నాయక్,గుగులోత్ లక్ష్మణ్, వట్టం రామ్మూర్తి, బాధావత్ కళ్యాణ్,కొండ్ర వెంకన్న ,పద్మ, బద్రి ఝాన్సీ తదితరులు పాల్గొన్నా