Thursday, 5 November 2026

రోజూ 34వేల లీటర్ల పాలసేకరణ

మరో మూడు కొత్త డెయిరీ కేంద్రాల ఏర్పాటు

(జ‌నం సాక్షి ):రాష్ట్ర ప్రభుత్వం పాడిరైతులకు భరోసా కల్పిస్తోంది. దీంతో తెలంగాణలోనే జనగామ జిల్లా పాలసేకరణలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ ద్వారా ప్రతి రోజు 34 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. డెయిరీ ఆధ్వర్యంలో 13 బల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, 240పాల సేకరణ కేంద్రాలు నడుస్తున్నాయి. సుమారు 8వేల మంది రైతులు ఆయా సెంటర్లకు పాలు పోస్తూ లబ్ధిపొందుతున్నారు. వీరితో పాటు నల్లగొండ, రంగారెడ్డి మిల్క్‌ డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్‌ డెయిరీకి 4వేల మంది పాలుపోస్తున్నారు. దీంతో . స్థానికంగా ఉన్న డిమాండ్‌ను బట్టి గత ఏడాది అధికారులు మూడు పాలశీతలీకరణ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపారు. ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఉన్నతాధికారులు రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి, గుండాల మండలం మరిపడిగ, చిలుపూరు మండలం కృష్ణాజీగూడెంలో మినీ పాలశీతలీకరణ కేంద్రాలు మంజూరు చేశారు. ఒక్కో కేంద్రంలో సుమారు రూ.30లక్షల విలువైన ఆధునాతన యంత్రాలు అమర్చారు. త్వరలో వీటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో కేంద్రం ద్వారా రోజుకు 2వేల లీటర్ల పాలను సేకరించే అవకాశాలున్నాయి. డెయిరీకి పాలు పోసే రైతులకు జననీ బీమా యోజన పథకం కింద బీమా సౌకర్యం కలిస్తున్నారు. బీమా చేసిన రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.70 వేలు, సహజ మరణమైతే రూ. 30 వేలు అందజేస్తారు. ఈ పథకంలో 4 వేల మంది రైతులు చేరారు.