ఉప్పల్ జనంసాక్షి : హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతిచెందారు. అంబర్‌పేట పోలీస్ లైన్‌లో నివాసముంటున్న సురేశ్‌బాబు ఉప్పల్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన ఎస్‌ఐ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్‌ఐ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




