రోడ్డు ప్రమాదంలో సీపీఐ (ఎం) కార్యకర్త మృతి

నివాళులర్పించిన సీపీఐ(ఎం) నాయకులు
చేర్యాల (జనంసాక్షి) జులై 21 : చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన సీపీఐ(ఎం)కార్యకర్త దండ బోయిన పోచయ్య (60) చేర్యాల పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి గురువారం పోచయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. పోచయ్య మృతి పార్టీకి తీరని లోటని, అనేక పోరాటాలలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దాసరి కళావతి, చేర్యాల,మద్దూరు మండలాల కార్యదర్శులు కొంగరి వెంకట మావో, ఆలేటి యాదగిరి, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, ముస్త్యాల ప్రభాకర్, నాయకులు రాళ్లబండి భాస్కర్, ఇప్ప కాయల శోభ,అత్తిని శారద, పోలోజు శ్రీహరి,  రేపాక కుమార్, గొర్రె శ్రీనివాస్,మేర్గోజు సత్యనారాయణ,మేర్గోజు రామచంద్రం, వీరన్న పేట సర్పంచ్ కొండపాక బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.