రోస్టర్ లోనే ప్రమోషన్లు ఇవ్వాలి
జనం సాక్షి,1996 కన్నా ముందు నుండే నేరుగా ఉద్యోగ నియామకాలలో రోస్టర్ విధానం ఉన్నదని, హుజురాబాద్ డివిజన్ ఎస్సీ, ఎస్టి జాయింట్ సెక్రెటరీ భూక్య రమేష్ నాయుడు తెలిపారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలోని నాలుగు విద్యాసంస్థలలో టి ఓ ఓ 954,తేదీ.01-31-2021, టిజిఓఓ 06/2021 ఎస్ పి ఓ ఓ 101/21 విడుదల చేసి సీనియారిటీని మెరిట్ గా తీసుకొని ప్రమోషన్లు ఇస్తున్నారని, దీనివలన ఎస్సీ,ఎస్టీ, బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని అని వారు తెలిపారు. కనుక అలా కాక రోస్టర్ లోనే ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో ఈ అన్యాయంపై ప్రత్యక్ష ఆందోళన చేస్తామని వారు ఒక ప్రకటనలో తెలిపారు.