వ్యక్తి అరెస్ట్..రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్,జూలై7(జనం సాక్షిv): మయన్మార్ దేశస్తులకు అక్రమంగా బోనోఫైడ్ సర్టిఫికెట్స్ ఇచ్చిన వ్యక్తిని బాలాపూర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌రెడ్డి కథనం ప్రకారం… బర్మా దేశస్తులైన ముగ్గురు రోహింగ్యా ముస్లింలు మహ్మద్ యూనుస్, మహ్మద్ నసీం, సలీమాబేగం అక్రమంగా ఇండియన్ ఆధార్, పాస్‌పోర్టు, ఓటర్ గుర్తింపు కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు పొందారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ధ్రువపత్రాలపై పోలీసులు ఆరా తీయగా.. అబ్దుల్ కాలిక్యూ అనే వ్యక్తి బాలాపూర్ మండలం షాహీన్‌నగర్, క్యూబాకాలనీలో క్రీసెంట్ స్కూల్ నడుపుతున్నాడు. ఇతను డబ్బులకు ఆశపడి నగరంలో రోహింగ్యా ముస్లింలకు స్కూల్ నుంచి బోన్గో/డ్ సర్టిఫికెట్స్ ఇచ్చాడు. వీటి ఆధారంగా వారు ఇండియన్ పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, ఎస్‌బీఐ బ్యాంకు అకౌంట్, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్స్ తదితర సర్టిఫికెట్స్ పొందారు. కారణమైన క్రీసెంట్ స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ కాలిఖ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. క్రీసెంట్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్, అడ్మిషన్స్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ హెడ్‌మాస్టర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐ సైదులు పాల్గొన్నారు.




