Wednesday, 4 November 2026

రాష్ట్రంలో వర్షాల జోరు

పలు జిల్లాల్లో వర్షాలతో పొంగుతున్న వాగులు

గోదావరిలో చేరుతున్న వరదనీరు

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు

జంటనగరాల్లో మొదలైన వర్షాలు

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): ఆలస్యంగా అయినా రుతపవనాల్లో కదలిక వచ్చింది. రాష్ట్రంలో గత రెండు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు వనివంఆరం భాగ్యనరగం మేఘావృతం అయి కొన్నిచోట్ల మంచి వర్షాలు పడ్డాయి. మరి కొన్నిచోట్ల ముసురు ఆవరించింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా/-లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవగా? మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లో భారీగా వరదనీరు చేరుతోంది. పలుచోట్ల మత్తడి దుంకుతున్నాయి. వరుణుడి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతకు ఈ వర్షాలు ఉరటనిచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తారు నుంచి సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్నది. ఆదిలాబాద్‌లో కడెం ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. ధర్మారం మండలంలో అత్యధికంగా 12 సెం. విూ. వర్షపాతం నమోదైంది. జూలపల్లిలో 11 సెం.విూ.. సుల్తానాబాద్‌లో 8 సెంటీవిూటర్ల వర్షం పడింది. కాల్వ శ్రీరాంపూర్‌ మండలం గంగారం వద్ద హుస్సేన్‌ మియా వాగుపై నిర్మించిన చెక్‌ డ్యాం నిండి మత్తడి దూకుతుంది. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామం పరిధి గట్టుశింగారం లోని గౌరిగుండాల జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. అటు నిజామాబాద్‌ జిల్లానూ మోస్తారు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో 10 సెంటీ విూటర్లు, కామారెడ్డి పట్టణంతో పాటు? గాంధారి, సదాశివనగర్‌ లలో 8 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపేట మండలం పెద్దవాగు జలకళతో ఉట్టిపడుతుంది.ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉట్నూరులో 9 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. జైనథ్‌ మండలం సాత్నాల ప్రాజెక్టులోకి 3774 క్యూసెక్కులు, భీంగల్‌ మండలం మత్తడి ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల ఇన్‌ ఎ/-లో వచ్చి చేరుతోంది. గాదిగూడ మండలం ఖడ్కి వాగు పొంగి ప్రవహించడంతో? రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఏర్పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో దాదాపు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు.. 60 వేల క్యూబిక్‌ విూటర్ల ఓబీ మట్టి తరలింపు పనులకు విఘాతం కలిగింది. మందమర్రి ఏరియాలోని ఆర్కేపీ ఓసీపీలోనూ బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలం ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతున్నది. బెజ్జూరు మండలం కుశ్నపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుకుడ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగజ్‌ నగర్‌ లోని కాపువాడ, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి విూద వరద నీరు నిలవడంతో కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతల మానేపల్లి మండలం బాబాసాగర్‌లోని అర్కగూడ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆసిఫాబాద్లోని ఆడ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. వికారాబాద్‌ జిల్లాలో చిరుజల్లులు పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. జగిత్యాల, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షపాతం నమోదైంది. అటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ పటు చోట్ల ఓ మోస్తారు వర్షం కురిసింది. కుత్భుల్లాపూర్‌, పరిధిలోఅత్యధికంగా 3.5 సెంటీ విూటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా నుంచి దక్షిణ ఛత్తీస్‌ గఢ్‌.. సముద్ర మట్టానికి 2.1 కిలోవిూటర్ల నుంచి 4.5 కిలోవిూటర్ల మధ్యన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదే విధంగా కర్నాటక నుంచి మరాఠ్వాడా వరకు మరో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండంటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాల పల్లి, ఉమ్మడి వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వరుణుడి కరుణతో అన్నదాత సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.