Friday, 6 November 2026

లంబోదరుడి పూజలో పాల్గొన్న గొట్టిముక్కల వెంకటేశ్వరరావు…

కూకట్ పల్లి (జనంసాక్షి ): వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం కూకట్ పల్లి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కూకట్ పల్లి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లంబోదరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం కూకట్ పల్లి గ్రామంలో మొట్టమొదటి వినాయక మండపం వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో వెలిసిందన్నారు.నేడు ఈ మహావినాయకుడిని దర్శించుకొని వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వినాయక భక్త బృందం చైర్మన్ నాయినేని సూర్యప్రకాష్ రావు, రాంబాప్పాగారి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.